చందస్సు :- (2 మార్కులు)
1) ఉత్పలమాల :-
లక్షణాలు :-
• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.
• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.
• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.
• ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
• ప్రతి పాదంలో "భ, ర, న, భ, భ, ర, వ " అనే గణాలు ఉంటాయి.
• ప్రతి పాదంలో 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి చెల్లుతుంది.
• పై పాదంలో " భ, ర, న, భ, భ, ర, వ" అనే గణాలు ఉన్నాయి.
కాబట్టి ఇది " ఉత్పలమాల "
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
2) చంపకమాల:-
లక్షణాలు :-
• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.
• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.
• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.
• ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి.
• ప్రతి పాదంలో " న, జ, భ, జ, జ, జ, ర" అనే గణాలు ఉంటాయి.
• ప్రతి పాదంలో 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతి చెల్లుతుంది.
• పై పాదంలో" న, జ, భ, జ, జ, జ, ర "అనే గణాలు ఉన్నాయి.
కాబట్టి ఇది " చంపకమాల"
3) శార్దూలం:-
లక్షణాలు :
• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.
• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.
• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.
• ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
• ప్రతి పాదంలో" మ, స, జ, స, త, త, గ" అనే గణాలు ఉంటాయి.
• ప్రతి పాదంలో 1వ అక్షరానికి 13వ అక్షరానికి యతి చెల్లుతుంది.
• పై పాదంలో" మ, స, జ, స, త, త, గ " అనే గణాలు ఉన్నాయి.కాబట్టి ఇది " శార్దూలం





0 comments:
Post a Comment