HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

6వ తరగతి తెలుగు వాచకము మొదటి అధ్యాయం అమ్మ ఒడి స్టడీ మెటీరియల్

6వ తరగతి తెలుగు వాచకము మొదటి అధ్యాయం అమ్మ ఒడి స్టడీ మెటీరియల్


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


1)6వ తరగతి తెలుగు వాచకము పేరు?

A) తెలుగుబాట - 6

2) 6వ తరగతి తెలుగు వాచకము యొక్క ముఖచిత్రంపై ఉన్న పాఠం?

A) అమ్మ ఒడి

3) “భారతదేశ ప్రజలమైన మేము 1949వ సంవత్సరం, నవంబరు నెల 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని ఇక్కడ కలవు?

>> మాకోసం రూపొందించుకొని, మాకు మేమే సమర్పించుకున్నాం" ఈ మాటలు భారత రాజ్యాంగంలో ప్రవేశిక

4) “భారతదేశాన్ని సర్వసత్తాక, స్వామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యగణతంత్రంగా ప్రకటిస్తున్నాం" అనే మాటలు భారత రాజ్యాంగంలో ఇక్కడ కలవు?

>> ప్రవేశిక

5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతుంది?

>> సర్వ శిక్షా అభియాన్ (SSA)

6)"వందేమాతరం" అనే గేయాన్ని తొలిసారిగా "బంకించంద్ర చటర్జీ" ఈ నవలలో రాశారు? DSC - 2025

>> ఆనందమఠం (బెంగాలీ బాష)

7) "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" అనే గేయాన్ని రాసినవారు?

>> శంకరంబాడి సుందరాచారి

8) మన "జాతీయ గీతము"ను రాసినవారు?

>> రవీంద్రనాథ్ ఠాగూర్

9) "భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు" అనే ప్రతిజ్ఞను రాసినవారు?

>> పైడిమర్రి వెంకట సుబ్బారావు


1. అమ్మఒడి

1)"అమ్మఒడి" అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది?

>> గేయం

2) “అమ్మఒడి" అనే పాఠ్యభాగంలోని ఇతివృత్తం?

>> తల్లిప్రేమ

3) "అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడం" ఈ పాఠం యొక్క ఉద్దేశం?

>> అమ్మ ఒడి

4) "అమ్మఒడి” పాఠ్యభాగ రచయిత?

>> బాడిగ వెంకట నరసింహారావు

5) "బాడిగ వెంకట నరసింహారావు" ఈ శతాబ్దానికి చెందినవారు?

>> 20వ శతాబ్దం

6) "బాడిగ వెంకట నరసింహారావు "గారి జన్మస్థలం?

>> కృష్ణాజిల్లాలోని "కొతరం" అనే గ్రామం

7) "బాడిగ వెంకట నరసింహారావు" గారు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రాశారు?

>> 17 పుస్తకాలు

8) "బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం రాసిన పుస్తకాలు?

1) ఆవు- హరిశ్చంద్ర

2) ఋతువాణి

3) చిన్నారిలోకం

4) పాలబడి పాటలు

5) పూలబాలలు

6) బాలతనం

7) బాలరసాలు

9) "బాడిగ వెంకట నరసింహారావు" గారు క్రింది విధంగా ప్రసిద్ధులు?

>> బాలబంధు

10) "బాలసాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవారు?

>> బాడిగ వెంకట నరసింహారావు

11) "అనార్కలి" అనే నాటకాన్ని రాసినవారు?

>> వింజమూరి లక్ష్మీనరసింహారావు

12) "అనార్కలి" నాటకంలో "అనార్కలి" పాత్రను ధరించినవారు?

>> బాడిగ వెంకట నరసింహారావు

13) "అనార్కలి నరసింహారావు"గా ఖ్యాతి గడించినవారు?

>> బాడిగ వెంకట నరసింహారావు

14) "అమ్మ ఒడి" పాఠ్యభాగ మూలగ్రంథం?

>> బి. వి. నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం

15) "అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి" అన్న రచయిత?

>> బాడిగ వెంకట నరసింహారావు

16) "అమ్మ చూపును ఒరవడి, దైవమ్ము కంటెను త్వరపడి" అనే మాటల్లోని ఇతివృత్తం?

>> తల్లి ప్రేమ

17) "అమ్మ చెప్పిన సుద్దులు, అనిశమ్ము ఒప్పిన బుద్ధులు" అనే మాటల్లో "సుద్దులు" అనగా అర్థం?

>> మంచి మాటలు

18) "అనిశము" అనగా అర్ధం?

>> ఎల్లప్పుడు, నిరంతరం

19) "బుద్దులు" అనగా అర్ధం?

>> తెలివితేటలు

20) “అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము" అనే మాటల్లో "హాసము" అనగా అర్ధం?

A) చిరునవ్వు

21) "వికాసము" అనగా అర్థం?

>> సంతోషం


22) "అమ్మ మంజుల భాషణం, శ్రావ్యమ్ము వీనుల భూషణం" అనే మాటల్లో "భాషణం" అనగా అర్థం?

>> మాట్లాడడం

23) "వీనులు" అనగా అర్ధం?

>> చెవులు

24) "భూషణం" అనగా అర్థం?

>> అలంకారం

25) "అమ్మ హృది అనురాగము, దివ్యమ్ము భవ్యము యోగము" అనే మాటల్లోని "హృది” అనగా అర్ధం?

>> హృదయం, మనస్సు

26) “అనురాగము" అనగా అర్థం?

>> ప్రేమ

27) "దివ్యము" అనగా అర్ధం?

>> ఉత్తమమైనది, శ్రేష్టమైనది

28) “భవ్యము” అనగా అర్థం?

A) శుభకరమైనది

29) "యోగము" అనగా అర్థం?

>> అన్నిటినీ సమకూర్చేది

30) "అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు" అనే మాటల్లోని "కరములు" అనగా అర్ధం?

>> చేతులు

31) “ఆకరములు" అనగా అర్ధం?

>> నిలయాలు

32) "అమ్మ చరణ తలమ్ములు,మమ్ము పండు పొలమ్ములు" అనే గేయ రచయిత?

>> బాడిగ వెంకట నరసింహారావు

33) "చరణములు" అనగా అర్ధం?

>> పాదములు, కాళ్ళు

34) “తలము" అనగా అర్ధం?

>> నేల

35) "అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు" అనే గేయపాదాలు గల పాఠం?

>> అమ్మ ఒడి

36) "అమ్మయే నా సర్వము దైర్యమ్ము బలమూ గర్వము" అన్న కవి?

>> బాడిగ వెంకట నరసింహారావు

37) శిశువుకు తొలి గురువు?

>> అమ్మ

38) శిశువుకు బడి, గుడి ఏది?

>> అమ్మ ఒడి

39) "దేవుని కంటే ముందే త్వరపడుతూ శిశువు భవితకు ఒరవడి చూపించేది ఎవరు?

>> అమ్మ

40) అమ్మ చల్లని చేతులు వేటికి నిలయాలు?

>> దానధర్మాలకు నిలయాలు

41) “అమ్మ ఒడి" పాఠంలో పొందుపరిచిన విద్యాప్రమాణాల వరుసక్రమాన్ని గుర్తించండి?

1. శీర్షిక (పారంపేరు)

2. వినడం- ఆలోచించి మాట్లాడడం

3. ఉద్దేశం

4. కవిపరిచయం

5. పాఠ్యాంశం

6. సారాంశం

7. ఇవి చేయండి

8. అవగాహన-ప్రతిస్పందన

9. వ్యక్తీకరణ - సృజనాత్మకత

10. భాషాంశాలు

11. నేనివి చేయగలనా?

42) ఉపాధ్యాయుడు చెప్పి "ఉక్తలేఖనం" ఈ విద్యాప్రమాణంలో కలదు?

>> ఇవి చేయండి

43) "గేయాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడడం" అనేది ఈ విద్యాప్రమాణానికి చెందినది?

>> అవగాహన-ప్రతిస్పందన

44) "ఏదైనా ఒక సంఘటనను, సన్నివేశాన్ని, అంశాన్ని సమర్ధిస్తూ తరగతిగదిలో చర్చించడం" అనేది ఈ విద్యాప్రమాణానికి చెందినది?

>> అవగాహన-ప్రతిస్పందన

45) "గేయం/కవిత/పద్యం/గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయడం" ఈ విద్యాప్రమాణానికి చెందినది?

>> అవగాహన-ప్రతిస్పందన

46) "గేయం/కవిత/కథను పొడిగించి రాయడం" అనేది ఈ విద్యాప్రమాణానికి చెందినది?

>> వ్యక్తీకరణ-సృజనాత్మకత


మాతృదేవోభవ, పితృదేవోభవ (చదవండి ఆనందించండి)

1) భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని ప్రకటించినవారు?

>> పరమశివుడు

2) “కుమారస్వామి" యొక్క వాహనం పేరు ఏమిటి?

>> నెమలి

3) తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని వినాయకునికి చెప్పినది ఎవరు?

>> నారదుడు

4) “గణాధిపత్యం” ఎవరు దక్కించుకున్నారు?

>> వినాయకుడు

5) "సోదరుల మధ్య ఎలాంటి విరోధభావాలు ఉండకూడదు" అనే విషయాన్ని వీరి సోదరత్వం ద్వారా గ్రహించాలి?

>> వినాయకుడు, కుమారస్వామి సోదరత్వం

6వ తరగతి తెలుగు వాచకము మొదటి అధ్యాయం అమ్మ ఒడి స్టడీ మెటీరియల్

0 comments:

Post a Comment

Recent Posts