HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

అలంకారం రకాలు లక్షణాలు ఉదాహరణలు

అలంకారం రకాలు లక్షణాలు ఉదాహరణలు
అలంకారం అంటే ఏమిటి?

కావ్యానికి లేదా భాషకు అందాన్ని, ఆకర్షణను చేకూర్చే వాటిని అలంకారాలు అంటారు. స్త్రీలకు ఆభరణాలు ఎలా అందాన్ని ఇస్తాయో, అలంకారాలు కూడా పద్యాలు మరియు కవితలకు అలాంటి సౌందర్యాన్ని తెచ్చిపెడతాయి.

ఇవి ప్రధానంగా రెండు రకాలు:
1. శబ్దాలంకారాలు:
పదాల కూర్పు ద్వారా, వాటి ఉచ్ఛారణలో వచ్చే శబ్దం/నాదం ద్వారా భాషకు అందాన్ని చేకూర్చేవి. వీటిలో శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదాహరణలు: వృత్యానుప్రాసాలంకారం, ఛేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, యమకాలంకారం.
2. అర్థాలంకారాలు:
కవితలోని పదాల అర్థం ద్వారా, చమత్కారం ద్వారా పాఠకులకు ఆనందాన్ని, భావ సౌందర్యాన్ని అందించేవి. వీటిలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదాహరణలు: ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం, స్వభావోక్తి అలంకారం, శ్లేషాలంకారం

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


1.క్రమాలంకారం / యధాసంఖ్యాలంకారం

1 అలంకారం పేరు క్రమాలంకారం / యధాసంఖ్యాలంకారం
2 లక్షణంఒక వరసలో ఉన్న పదాలకు అదే వరసలో అన్వయాన్ని చెప్పడాన్ని "క్రమాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) శత్రువునిమిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము బెంటింపుము

2) గజకచ్ఛపమూషికంబులు వనజలబిలములందు ప్రవేశించాయి.

3) సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు.

2.శ్లేషాలంకారం
 
1 అలంకారం పేరు శ్లేషాలంకారం
2 లక్షణంఒకే వాక్యంలో రెండు అర్థాలు వచ్చేలా చెప్పడాన్ని “శ్లేషాలంకారం"

3 ఉదాహరణలు 1) రాజు కువలయానందకరుడు.

వివరణ :-

రాజు అనగా " ప్రభువు, చంద్రుడు " అని అర్ధం.

కువలయం అనగా " భూమి, కలువలు" అని అర్ధం

ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు. చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగిస్తాడు.



3.యమకాలంకారం
 
1 అలంకారం పేరు యమకాలంకారం
2 లక్షణంఒక పదం అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ రావడాన్ని "యమకాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) లేమా! దనుజుల గెలువగ లేమా?
2) ప్రాయము జల కల్లోల ప్రాయము


4.ఉత్ప్రేక్షాలంకారం
 
1 అలంకారం పేరు ఉత్ప్రేక్షాలంకారం
2 లక్షణంఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని "ఉత్ప్రేక్షాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లు ఉంది.
2) ఆకాశం కాటుకను వర్షిస్తుంది అన్నట్లు ఉంది. 
3) ఆ ఏనుగు నడుస్తున్న కొండా అన్నట్లు ఉంది.




5.అతిశయోక్షి అలంకారం
 
1 అలంకారం పేరు అతిశయోక్షి అలంకారం
2 లక్షణంగోరంత విషయాన్ని కొండంతలు చేసి చెప్పడాన్ని "అతిశయోక్తి అలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) మా నూతిలో నీళ్ళు పాతాళానికి చేరాయి.

2) భూమి, ఆకాశం ఏకమగునట్లుగా వర్షం కురుస్తోంది.

3 ) సముద్రపుటలలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

4) పి. టి. ఉష గాలి కంటే వేగంగా పరుగెత్తింది.


6.ముక్తపదగ్రస్తాలంకారం
 

1 అలంకారం పేరు ముక్తపదగ్రస్తాలంకారం
2 లక్షణంమొదటి లైనులో చివరన ఉన్న పదం మళ్ళీ రెండవ లైను మొదటి పదంగా రావడాన్ని "ముక్తపదగ్రస్తాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) మన వేటికి నూతనమా తన మా నిని ట్రేమ? తనకు దదక్కితిననుమ2) సుదత్ నూతన మదనా మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనా


7.లాటానుప్రాసాలంకారం
 
1 అలంకారం పేరు లాటానుప్రాసాలంకారం
2 లక్షణంఒక పదం అర్థభేదం లేకుండా తాత్పర్యభేదంతో పక్క పక్కనే రావడాన్ని "లాటానుప్రాసాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) మలయగిరి నుండి వచ్చే గాలి గాలి

2) అమ్మ చూపించే ప్రేమ ప్రేమ



8.రూపకాలంకారం
 
1 అలంకారం పేరు రూపకాలంకారం
2 లక్షణంఉపమేయానికి, ఉపమానానికి బేధం లేదని చెప్పడాన్ని "రూపకాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) నీక వగచి వగచి నిర్బిన్న హృదయులై విగత చక్రులైరి వినవే? వారలరిగి యింకనైన నమ్ముదుసళ్ళ యు దగ్ర శోకవహ్ని నార్పవయ్య

2) సంసార సాగరాన్ని ఈదటం కష్టం.

3) ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది.

4) దుఃఖసముద్రము భారతీయ హృద్ధ్వారము సొచ్చి అగ్ని వలె జ్వాలలు వీదుచునున్న దెంతయున్.




9.చేకానుప్రాసాలంకారం
 
1 అలంకారం పేరు చేకానుప్రాసాలంకారం
2 లక్షణంఒక పదం అర్థభేధంతో పక్క పక్కనే రావడాన్ని "చేకానుప్రాసాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది.

2) ఈ ఏడు ఏడు రోజులపాటు వ్రతం చేయాలి.

3) గోరువంక వంక చూసిను.

 4) సమస్యల సాధనకు వారి వారి బిగించింది.

5) సుందర దరహాస రుచులు.

6) రాజా! నీది శుభంకర కరం.

7) ఆ కొమ్మ కొమ్మవంచి పూలు కోసెను.




10.వృత్యనుప్రాసాలంకారం
 
1 అలంకారం పేరు వృత్యనుప్రాసాలంకారం
2 లక్షణంఒక హల్లు అనేకసార్లు మళ్ళీ మళ్ళీ రావడాన్ని "వృత్యనుప్రాసాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) భేరికా దొండదడాండ నినదంబుల జాండము నిండ

2) అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.

3) ఇదికాదదియనునదికా దిదియను నిది నదియు వదిలి యెదియో వదరన్ వదలని ముదములఁ బొదలగ నదవదపడి చెదరి యెడCద హరిహరనాథ్.

4) లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్యయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?



11.దృష్టాంతాలంకారం

 
1 అలంకారం పేరు దృష్టాంతాలంకారం
2 లక్షణంఒక భావం అర్ధం కావడానికి మరొక బావాన్ని అద్దంలో చూపించినట్లు చెప్పడాన్ని "దృష్టాంతాలంకారం" అంటారు."
3 ఉదాహరణలు 1) పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు.

2) వెలితికుండ తొణుకుతుంది. కానీ నిండుకుండ తొణకదు. అలాగే నీచుడు కఠినంగా మాట్లాడతాడు. మంచివాడు కఠినంగా మాట్లాడడు.



12.స్వభావోక్తి అలంకారం

1 అలంకారం పేరు స్వభావోక్తి అలంకారం
2 లక్షణంఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందంగా వర్ణించి చెప్పడాన్ని "స్వభావోక్తి అలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు

2) జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.


అలంకారం రకాలు లక్షణాలు ఉదాహరణలు

0 comments:

Post a Comment

Recent Posts