6వ తరగతి తెలుగు వాచకము రెండవ అధ్యాయం తృప్తి స్టడీ మెటీరియల్
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
1)"తృప్తి" అనే పాఠం ఈ ప్రక్రియకు చెందినది?
>> కథానిక
2) “తృప్తి” అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?
>> మానవ విలువలు
3) “సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని తెలియజేయడం" ఈ పాఠం యొక్క ఉద్దేశం?
>> తృప్తి
4) "తృప్తి” పాఠ్యభాగ రచయిత పేరు ఏమిటి?
>> సత్యం శంకరమంచి
5) "సత్యం శంకరమంచి" ఏ శతాబ్దికి చెందినవాడు?
>> 20వ శతాబ్దం
6) "సత్యం శంకరమంచి" యొక్క జన్మస్థలం ఏది?
>> గుంటూరు జిల్లా అమరావతి
7) "సత్యం శంకరమంచి” గారు రాసిన “కథా సంపుటాలు" ఏవి?
1. అమరావతి కథలు
2. కార్తీకదీపాలు
8) "సత్యం శంకరమంచి" గారు రాసిన "నవలలు" ఏవి?
1. రేపటిదారి
2. సీత స్వగతాలు
3. ఆఖరి ప్రేమలేఖ
4. ఎడారిలో కలువపూలు
9) "సత్యం శంకరమంచి" గారు రాసిన “నాటకం" ఏది? SGT 2025
>> హరహరమహాదేవ
10) 1979లో "రాష్ట్ర సాహిత్య అకాడమీ" పురస్కారం పొందిన "సత్యం శంకరమంచి" గారి రచన?
>. అమరావత్ కథలు
11) "తృప్తి" పాఠమునకు మూలం?
>> అమరావతి కథలు
12) "పూర్ణయ్య" అనే పాత్ర గల పాఠం?
>> తృప్తి
13) "పూర్ణయ్య"ని అందరూ ఏమని పిలుస్తారు?
>> బావగాడు
14) "బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరము లేదు" ఈ మాటలు గల పాఠం?
>> తృప్తి
15) "తృప్తి" పాఠంలో పెళ్లిళ్లకు, పేరంటాలకు వంటపనులన్నీ చూసుకునేది ఎవరు?
>> బావగాడు (పూర్ణయ్య)
16) "తృప్తి" పాఠంలో “వనసంతర్పణ" ఎక్కడ పెట్టుకున్నారు?
>> మామిడితోపు
17) "తృప్తి" పాఠంలో "అందరూ వినండర్రా" అని పెద్దగా గావుకేక పెట్టినది ఎవరు?
>> బావగాడు (పూర్ణయ్య)
18) "తృప్తి" పాఠంలో "వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను" అంటూ లిస్టు చదివినది ఎవరు?
>> బావగాడు (పూర్ణయ్య)
19) "తృప్తి" పారంలో పూర్ణయ్య "మెంతికారం పెట్టిన కూర"ను ఏ కూరగాయతో చేయించాడు?
>> వంకాయ
20) “తృప్తి" పాఠంలో పూర్ణయ్య "నిమ్మకాయ పిండిన కూర"ను ఏ కూరగాయతో చేయించాడు?
>> అరటికాయ
21) "తృప్తి" పాఠంలో పూర్ణయ్య "కొబ్బరి పచ్చడి"ని దేనితో చేయించాడు?
>> వాక్కాయ
22) "తృప్తి" పారంలో పూర్ణయ్య "పెరుగు పచ్చడి"ని ఏ కూరగాయతో చేయించాడు?
>> పొట్లకాయ
23) “తృప్తి" పాఠంలో పూర్ణయ్య "దారు”లో ఏయే పదార్థాలు వేయిందాడు?
>> అల్లం, ధనియాలు
24) "తృప్తి" పాఠంలో పూర్ణయ్య "పప్పుదారు"లో ఏమి వేయించాడు?
>> మసాలా
25) "తృప్తి" పాఠంలో పూర్ణయ్య "జీడిపప్పు, పచ్చ కర్పూరం "వేయించి ఏ వంటకం చేయించాడు?
>> పాయసం
26) “తృప్తి" పారంలో పూర్ణయ్య "మామిడికోరు"తో ఏ వంటకం తయారు చేయించాడు?
>> పులిహోర
27) “తృప్తి" పాఠంలో “గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు” చేస్తున్నాను. "అందరికీ సమ్మతమేనా" అని పూర్ణయ్య అన్న మాటల్లోని ఇతివృత్తం?
>> మానవ విలువలు
28) "వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెందాడు" ఈ మాటలు గల పాఠం?
>> తృప్తి
29) “మమకారం" అనగా అర్థం?
>> ప్రేమ, అనురాగం
30) "జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది". ఈ వాక్యంలోని అలంకారం?
>> ఉపమాలంకారం
31) "వంకాయ"ను గురించి చర్చలు జరిగిన పాఠం?
>> తృప్తి
32) "వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి" అన్నది ఎవరు?
>> బావగాడు (పూర్ణయ్య)
33) "చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహాచక్కగా మేళవిస్తుంది" ఈ మాటలు గల పాఠం?
>> తృప్తి
34) "తృప్తి" పాఠంలో పూర్ణయ్య వంటలు కొరకు ఏమి త్రవ్వించాడు?
>> గాడిపొయ్యి
35) “ఆ వాసన చూశారా పులిహోర తిరగమోత... సన్నబియ్యంతో చేయిస్తున్నాను"- ఈ వాక్యంలో రచయిత మూడు చుక్కలు వాడాడు. దీని అర్ధం ఏమిటి?
>> అక్కడ చెప్పవలసిన మాటలు ఏవో ఉన్నాయి అని అర్ధం.
36) “లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి" అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించింది ఎవరు?
>> బావగాడు (పూర్ణయ్య)
37) "సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు"---> ఈ వాక్యంలోరచయిత ఉపయోగించిన విరామచిహ్నాలు?
1. అనుకరణచిహ్నములు ("")
2. ప్రశ్నార్థకచిహ్నం(?)
38) “బావగాడు" నేతిజారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు... ఈ మాటల్లోని ఇతివృత్తం?
>> మానవ విలువలు
39) "వంకాయ వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు" ఈ మాటలు గల పాఠం మరియు పాత్ర?
>> తృప్తి - బావగాడు (పూర్ణయ్య)
40) "చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి" అన్నది ఎవరు?
>> పూర్ణయ్య
41) "పప్పుదారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి" అన్నది?
>> పూర్ణయ్య
42) "వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు. తప్పులేదు." అన్నది?
>> పూర్ణయ్య
43) "ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తిచేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో" అన్నది?
>> పూర్ణయ్య
44) “అప్పుడే మంచినీళ్ళు తాగెయ్యకు. మీగడ పెరుగుంది... "అన్నది?
>> పూర్ణయ్య
45) "కష్టపడి వండారు తినకపోతే ఎలా?" అని వంటవాళ్లకు కొసరి కొసరి వడ్డించింది ఎవరు?
>> పూర్ణయ్య
46) " ఓ గంటి పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డిపించుకుని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేసింది ఎవరు?
>> పూర్ణయ్య
47) “నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు" ----> ఈ మాటలలోని ఇతివృత్తం?
>> మానవ విలువలు
48) “ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ఇలా పిలుస్తారు"?
>> ద్విత్వాక్షరం
49) "ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని ఇలా పిలుస్తారు"?
>> సంయుక్తాక్షరం
50) "వజ్రము" అనే పదంలోని "హల్లులు" సంఖ్య?
>> 4 (నాలుగు) వ్ + అ + జ్+ ర్ + అ + మ్మ్ + ఉ
51) "వజ్రము” అనే పదంలోని "అచ్చులు" సంఖ్య?
>> 3 ()
52) "వజ్రము" అనే పదంలోని సంయుక్తాక్షరాన్ని గుర్తించండి?
>> జ్ర
53) “వజ్రము” అనే పదంలో ఉన్న సంయుక్తాక్షరంలోని "హల్లులు" సంఖ్య?
>> 2
54) “వజ్రము” అనే పదంలో ఉన్న సంయుక్తాక్షరంలోని "అచ్చులు" సంఖ్య?
>> 1
55) "ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఒత్తులుగా రావడాన్ని ఇలా పిలుస్తారు"?
>> సంక్లిష్టాక్షరాన్ని
56) "వస్త్రము" అనే పదంలోని "హల్గులు" సంఖ్య?
>> 5
57) “వస్త్రము” అనే పదంలోని "అచ్చులు" సంఖ్య?
>> 3
58) "వస్త్రము" అనే పదంలో ఉన్న సంక్లిష్టాక్షరాన్ని గుర్తించండి?
>> స్త్ర
59) "వస్త్రము" అనే పదంలో ఉన్న సంక్లిష్టాక్షరంలోని "హల్లులు" సంఖ్య?
>> 3
60) "వస్త్రము" అనే పదంలో ఉన్న సంక్లిష్టాక్షరంలోని “అచ్చులు” సంఖ్య?
>> 1
కుచేలోపాఖ్యానం (చదువు- ఆనందించు)
1)"కుచేలుడు" ఎవరి స్నేహితుడు?
>> శ్రీకృష్ణుడు
2) కుచేలుడు తన మితుడైన కృపుడి కొరకు ఏమి తీసుకెళ్లాడు?
>> అటుకులు
3) “మిత్రప్రేమ"కు దృష్టాంతం అయిన కథ?
>> కుచేలోపాఖ్యానం


0 comments:
Post a Comment