6వ తరగతి తెలుగు వాచకము మూడవ అధ్యాయం మాకొద్దీ తెల్లదొరతనము స్టడీ మెటీరియల్
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
1)"మాకొద్దీ తెల్లదొరతనం" అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
• గేయం
2) “మాకొద్దీ తెల్లదొరతనం" అనే పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి?
• దేశభక్తి
3) "స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాల్ని, ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్నీ తెలియజేయడం" ఈ ఉద్దేశం గల పారం?
• మాకొద్దీ తెల్లదొరతనం
4) “మాకొద్దీ తెల్లదొరతనం" పాఠ్యభాగ రచయిత ఎవరు?
• గరిమెళ్ళ సత్యనారాయణ
5) "గరిమెళ్ళ సత్యనారాయణ" గారు ఏ శతాబ్దికి చెందినవాడు?
• 20వ శతాబ్దం
6) "గరిమెళ్ళ సత్యనారాయణ" గారి జన్మస్థలం?
• శ్రీకాకుళం జిల్లా, గోనెపాడు గ్రామం.
7) "గరిమెళ్ళ సత్యనారాయణ" గారు "స్వరాజ్య గీతములు"ఏ సంవత్సరంలో రాశారు?
• 1921
8) “గరిమెళ్ళ సత్యనారాయణ” గారు “హరిజనుల పాటలు" ఏ సంవత్సరంలో రాశారు?
• 1923
9) "గరిమెళ్ళ సత్యనారాయణ" గారు "ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు" ఏ సంవత్సరంలో రాశారు?
• 1926
10) “దండాలండోయి మేముండలేమండోయ్ బాబు, మాకొద్దీ తెల్లదొరతనం" అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయకవి?
• గరిమెళ్ళ సత్యనారాయణ
11) "దేశభక్తి కవితలు రాసి, జైలుశిక్ష అనుభవించినవారిలో మొదటివారు?
• గరిమెళ్ళ సత్యనారాయణ
12) "మాకొద్దీ తెల్లదొరతనము, దేవమాకొద్దీ తెల్లదొరతనము" అన్న కవి?
• గరిమెళ్ళ సత్యనారాయణ
13 ) "పన్నెండు దేశాలు పండుచున్నాగాని పట్టెడన్నమె లోపమండీ" ఈ మాటల్లోని ఇతివృత్తం?
• దేశభక్తి
14) "అయ్యో! కుక్కలతో పోరాడి కూడూ తినమంటాడు" ఈ పాదం ఏ పాఠంలోనిది?
• మాకొద్దీ తెల్లదొరతనం
15) "ధనము కోసము వాడు దారి చేసికోని కల్లు సారాయమ్ముతాడు" ఈ మాటలు గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు?
• ఆంగ్లేయులను
16) "మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు" అని గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు?
• ఆంగ్లేయులను
17) "గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటాడురాట్నం బడిలో పెట్టవద్దంటాడు" అనే గేయపాదాలు ఈ పాఠంలోనివి?
• మాకొద్దీ తెల్లదొరతనం
18) “అయ్యో! రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట" అని బాధపడ్డ కవి?
• గరిమెళ్ళ సత్యనారాయణ
19) "నూటనలుబదినాల్గు నోటికి తగిలించి మమ్ము పాట పాడ వద్దంటాడు మాటలాడ వద్దంటాడు.- ఈ గేయ పాదాల్లో గల ఇతివృత్తం?
• దేశభక్తి
20) "అయ్యో! చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు" అని వాపోయిన కవి?
• గరిమెళ్ళ సత్యనారాయణ
21) "వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాటీ చేస్తాడీ దేశమునపోరాటమాడుతాడు పైన మోమాటము పడడు సుంతైన" - ఈ గేయ పాదాలు గల పాఠం?
• మాకొద్దీ తెల్లదొరతనం
22) “ధనము" అనగా అర్ధం?
• డబ్బు
23) “ముల్లో" అనగా అర్ధం?
• డబ్బు
24) "ఆలి" అనగా అర్థం?
• భార్య
25) "పుస్తెలు" అనగా అర్థం?
• తాళిబొట్లు
26) “సుంత" అనగా అర్థం? SGT-2025
• కొంచెం
సమయపాలన (చదవండి ఆనందించండి)
1)"గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పళ్ళు తోముకునే సమయంలో ఈ శ్లోకాలను బట్టీ పట్టేవారు?
• భగవద్గీతలోని శ్లోకాలు


0 comments:
Post a Comment