HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

6వ తరగతి తెలుగు వాచకము నాల్గవ అధ్యాయం సమయస్ఫూర్తి స్టడీ మెటీరియల్

6వ తరగతి తెలుగు వాచకము నాల్గవ అధ్యాయం సమయస్ఫూర్తి  స్టడీ మెటీరియల్


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


1)"సమయస్ఫూర్తి" అనే పాఠం ఈ ప్రక్రియకు చెందినది?

• కథ

2) “సమయస్ఫూర్తి" అనే పాఠ్యభాగ ఇతివృత్తం?

• సమయస్పూర్తి

3) ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు?

• పంచతంత్ర కథలు

4) "పంచతంత్ర కథలు"ను మొదట సంస్కృత భాషలో రాసిన కవి?

• విష్ణుశర్మ

5) "పంచతంత్ర కథలు"ను "నీతిచంద్రిక" అనే పేరుతో తెలుగులోకి అనువదించినవారు?

• చిన్నయసూరి

6) "ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభను కనపరచి ఆపదల నుండి తప్పించుకోవాలనీ, మోసపు మాటల్ని నమ్మకూడదని తెలియజేయడం" ఈ ఉద్దేశం గల పాఠం?

• సమయస్పూర్తి

7) "సమయస్పూర్తి" పాఠ్యభాగ రచయిత?

•  కందుకూరి వీరేశలింగం

8) "కందుకూరి వీరేశలింగం" గారు ఈ శతాబ్దికి చెందినవాడు?

• 19వ శతాబ్దం

9) "కందుకూరి వీరేశలింగం" గారు ఏ సంవత్సరంలో జన్మించారు?

• 1848

10) "కందుకూరి వీరేశలింగం" గారి జన్మస్థలం?

• తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి.


11) "కందుకూరి వీరేశలింగం" గారి రచనలు?

1. రాజశేఖర చరిత్ర

2. సత్యరాజా పూర్వదేశ యాత్రలు

3. హాస్య సంజీవని

4. సతీహితబోధిని

5. ఆంధ్రకవుల చరిత్ర

12) "గద్య తిక్కన" అనే బిరుదు గల కవి?

• కందుకూరి వీరేశలింగం

13) "సమయస్ఫూర్తి” అనే పాఠమునకు మూలం?

• విగ్రహం

14) "సమయస్ఫూర్తి" అనే పాఠంలోని పాత్రలు?

1. రోమశుడు - పిల్లి

2. పలితుడు - ఎలుక

3. చంద్రకుడు - గుడ్లగూబ

15) "పంచవటం" అనగా అర్థం?

• ఐదు చెట్ల సమూహం

16) "రోమశుడు" అనే పిల్లి ఎక్కడ నివసిస్తోంది?

• పంచవటంలోని ఒక మర్రిచెట్టు తొర్లలో

17 ) మర్రిచెట్టు క్రింది కన్నంలో కాపురముంటోంది ఎవరు?

• పలితుడు అనే ఎలుక

18) మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి వలలో చిక్కుకున్నది ఎవరు?

• రోమశుడు (పిల్లి)

19) "ఆహా! ఎంత అదృష్టము.నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈ నాటితో వాడి పీడ..." అనుకున్నది?

• పలితుడు (ఎలుక)

20) హాయిగా విహరిస్తున్న ఎలుక దగ్గరకు వచ్చినది ఎవరు?

• చంద్రకుడు (గుడ్లగూబ)


21) చంద్రకుని(గుడ్లగూబ) చూసి ఎవరి గుండె గుభేలుమంది?

• పలితుడు (ఎలుక)

22) "ఏం చెయ్యనురా దేవుడా" అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నది ఎవరు?

• పలితుడు (ఎలుక)

23) "ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది" అని మనసులో బాధపడ్డది ఎవరు?

• పలితుడు (ఎలుక)

24 ) "ఐనా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు దైర్యమొందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు" అని దైర్యం తెచ్చుకున్నది ఎవరు?

• పలితుడు (ఎలుక)

25 ) "ఎంతయినా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమశుని అర్ధించి ప్రాణాలు నిలబెట్టుకుంటానుఅని అనుకొని నెమ్మదిగా పిల్లివైపు అడుగులు వేసినది ఎవరు?

• పలితుడు (ఎలుక)

26 ) "మిత్రమా! నమస్కారం. జాతివైరమున్నా శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము." అని రోమకుడితో అన్నది ఎవరు? DSC - 2025

• పలితుడు (ఎలుక)

27) "ప్రస్తుతం కష్టకాలం వచ్చింది. కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం" అని ఎవరు ఎవరితో అన్నారు?

• పలితుడు (ఎలుక) రోమశుడితో (పిల్లితో)

28) " తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనుకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను" అని రోమశునితో అన్నది ఎవరు?

• పలితుడు (ఎలుక)

29) “తెలియనిదాని నోట్లోపడి దిక్కులేని దావు చచ్చేకన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరమూ స్నేహంగా ఉందామని, కాదంటే నీకాహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణస్నేహం కోసం తహతహలాడుతూ..." ఈ మాటలు ఎలుక ఎవరితో అన్నది?

• రోమశుడుతో (పిల్లితో)

30) "పలితుడి మాటలు విని ఆనందపరవశుడైనది ఎవరు"?

• రోమశుడు (పిల్లి)


31) "మిత్రమా! జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షింపదలచావు, నీకు కృతజ్ఞతలు." అని పలితునితో అన్నది?

• రోమశుడు (పిల్లి)

32 ) "నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

• రోమశుడు పలితునితో అన్నాడు.

33) “ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను" ఈ మాటలు ఎవరు అన్నారు?

• రోమశుడు (పిల్లి)

34) "మిత్రమా! పలితుడా! ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు." అన్నది?

• రోమశుడు (పిల్లి)

35) "సమయస్ఫూర్తి" పాఠంలో "బ్రతుకుజీవుడా! అంటూ పుటుక్కున చెట్టెక్కినది ఎవరు"?

• రోమశుడు (పిల్లి)

36) "మిత్రమా! బయటకిరా! మరో ఉద్దేశం లేదు. నన్ను నమ్ము కలసి మెలసి బ్రతుకుదాం. ఆనందంగా ఉందాం" అని ఎవరు ఎవరితో అన్నారు?

• రోమశుడు (పిల్లి) పలితుడితో (ఎలుకతో) అన్నాడు.

37) "మిత్రమా! చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిదీ అయింది. ఆ ప్రాణభయం ఇద్దరిది. అందుచేత నన్ను ఆశ్రయించాను." ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

• పలితుడు (ఎలుక) రోమశుడితో (పిల్లితో) అన్నాడు.

38) "జరిగింది ఉభయులకు లాభమే. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి." ఈ మాటలు గల పాఠం?

• సమయస్పూర్తి

39) "జాతి లక్షణం కాదనలేని వైరలక్షణం" అని పలితుడు రోమశుడితో అన్న మాటల్లోని ఇతివృత్తం?SGT-2025

• సమయస్పూర్తి

40) “కిరాతుడు" అనగా అర్థం?

• వేటగాడు


స్ఫూర్తి (చదవండి - ఆనందించండి)

1)"విక్రమసేనుడు ఏ రాజ్యాన్ని పరిపాలించేవాడు?

• మగద

2) యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు?

• ఒక కొండగుహలో

3) “నా కన్నబిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం. నిస్సహాయుడిగా ఎంత కాలమిలా దాక్కోవాలి?" అని అనుకున్నది ఎవరు?

• విక్రమసేనుడు

4) విక్రమసేనుడు ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఎవరు కంటపడ్డారు?

• ఒక చిన్న సాలీడు

5) ఒక చిన్న సాలీడు గుహ పై భాగంలో ఏమి అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తోంది?

• గూడు

6) సాలీడు పైకి పాకే కొద్దీ ఏమి జరుగుతుంది?

• సాలీడు నుండి వచ్చే దారం తెగి అది క్రిందికి జారిపోతూ ఉంది.

7) ఎన్నోమార్లు ప్రయత్నించి చివరికి గూడును అల్లడం పూర్తి చేసింది ఎవరు?

• సాలీడు

8) సాలీడు విజయవంతంగా గూడును అల్లడం పూర్తి చేయడం చూసిన విక్రమసేనుడి మనసులో ఏమి కలిగింది?

• ఒక కొత్త ఆలోచన

9) ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? అని అనుకున్నది ఎవరు?

• విక్రమసేనుడు

10) "నేను మనిషిని, అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పైఎత్తు వేయడానికి అదనంగా మెదడు కూడా ఇచ్చాడు." అని అనుకున్నది ఎవరు?

• విక్రమసేనుడు

11) “చెల్లా చెదురైన తన సైన్యాన్ని సమీకరించుకొని, శత్రువుపై దాడి చేసి తన రాజ్యాన్ని పొందినది ఎవరు?

• విక్రమసేనుడు

12) విక్రమసేనుడిలో స్ఫూర్తిని నింపినది ఎవరు?

• సాలీడు


6వ తరగతి తెలుగు వాచకము నాల్గవ అధ్యాయం సమయస్ఫూర్తి స్టడీ మెటీరియల్

0 comments:

Post a Comment

Recent Posts