MPTC / ZPTC ఓట్ల లెక్కింపు – అధికారుల కరదీపిక (Instruction Manual)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) | MPTC & ZPTC ఎన్నికలు – 2026
Prepared by RAJESH MASTER
1. లెక్కింపు కేంద్రం & సిబ్బంది ప్రాథమిక వివరాలు
| అంశం | వివరాలు |
|---|---|
| తేదీ & సమయం | 07-11-2026. ఉదయం 6:00 హాజరు & టేబుళ్ల కేటాయింపు (రాండమైజేషన్); ఉదయం 8:00 కి లెక్కింపు ప్రారంభం |
| లెక్కింపు కేంద్రం | ____________ (SEC ఉత్తర్వు ప్రకారం కేంద్రం పేరు, హాళ్లు, టేబుళ్ల సంఖ్య నింపండి) |
| బ్యాలెట్ పేపర్ రంగులు | MPTC – గులాబీ (PINK) | ZPTC – తెలుపు (WHITE) |
| డ్రమ్ములు | MPTC కి ఒక డ్రమ్ము, ZPTC కి వేరే డ్రమ్ము (బండిల్స్ కలపడానికి) |
| అనుమతి ఉన్నవారు | లెక్కింపు సిబ్బంది, RO/ARO, అబ్జర్వర్లు, అభ్యర్థులు నియమించిన కౌంటింగ్ ఏజెంట్లు |
| నిషేధం | మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ధూమపానం. బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు |
| గోప్యత | లెక్కింపు విధానంలో జరిగిన ప్రతి అంశం రికార్డు చేయాలి |
2. కౌంటింగ్ టేబుల్ సిబ్బంది – బాధ్యతలు
| పాత్ర | ముఖ్య బాధ్యతలు |
|---|---|
| కౌంటింగ్ సూపర్వైజర్ (1) | బ్యాలెట్ బాక్సుల సీళ్లు, పేపర్ సీళ్లు, PS నంబర్లను ఏజెంట్లకు చూపించడం. దశ-1: Form / PO డైరీలోని పోలైన ఓట్లతో బ్యాలెట్ పేపర్ల సంఖ్యను సరిచూసి Proforma-C1 నింపడం. దశ-2: ప్రతి 1,000 ఓట్ల లెక్కింపు తర్వాత Proforma-C2 నింపి, ఏజెంట్ల సంతకాలు తీసుకుని RO కు అందించడం |
| కౌంటింగ్ అసిస్టెంట్లు (2) | దశ-1: బాక్సులు తెరిచి, గులాబీ (MPTC), తెలుపు (ZPTC) పేపర్లను వేరు చేయడం; నిలువు మడత విప్పకుండా 25 పేపర్ల కట్టలు కట్టడం. దశ-2: 40 కట్టలను (1,000 ఓట్లు) ఏజెంట్లకు చూపిస్తూ అభ్యర్థుల వారీగా వేరు చేయడం; 50 ఓట్ల కట్టలు కట్టడం |
| కౌంటింగ్ ఏజెంట్లు | టేబుల్ వద్ద చూడవచ్చు; బ్యాలెట్ పేపర్లను తాకకూడదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఏజెంట్ల సంతకాలు/సీళ్లు అవసరం |
3. టేబుల్ కిట్ (Table Kit)
- బ్లూ/బ్లాక్ ఇంక్ పెన్నులు, పెన్సిళ్లు, కత్తెర/కత్తి, స్పాంజ్ డ్యాంపెనర్
- రబ్బరు బ్యాండ్లు (పెద్దవి & చిన్నవి), దారం, సీలింగ్ వ్యాక్స్, ప్లాస్టిక్ ట్రేలు
- Proforma-C1 & Proforma-C2 ఫారమ్స్ (MPTC కి ఒకటి, ZPTC కి ఒకటి), స్టేషనరీ
- MPTC (గులాబీ) మరియు ZPTC (తెలుపు) పేపర్ల కోసం వేరు వేరు ట్రేలు
4. లెక్కింపు క్రమం – ముందుగా పోస్టల్ బ్యాలెట్లు
- RO ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు చేపడతారు (AP Panchayat Raj (Conduct of Elections) Rules, 2006, Rule 57).
- ఉదయం 8:00 గంటలలోపు అందిన కవర్లు మాత్రమే పరిగణిస్తారు; ఆలస్యంగా వచ్చినవి తిరస్కరణ.
- సంతకం/ధృవీకరణ లేని కవర్లు రూల్స్ ప్రకారం తిరస్కరించాలి. సందేహం ఉంటే RO నిర్ణయం.
- పోస్టల్ లెక్కింపు పూర్తయ్యాక, పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సుల లెక్కింపు మొదలవుతుంది.
5. బ్యాలెట్ బాక్సుల లెక్కింపు – దశ-1 & దశ-2
దశ-1: ప్రాథమిక లెక్కింపు & కలపడం
- బాక్సు సీళ్లు, నంబరును ఏజెంట్లకు చూపించి బాక్సు తెరవాలి.
- గులాబీ (MPTC), తెలుపు (ZPTC) పేపర్లను వేరు చేయాలి.
- నిలువు మడత విప్పకుండా 25 పేపర్ల కట్టలు కట్టాలి.
- Form / PO డైరీలోని పోలైన ఓట్లతో సరిచూసి Proforma-C1 (Sheet-A) నింపాలి; తేడా ఉంటే RO కు చెప్పాలి.
- MPTC కట్టలు MPTC డ్రమ్ములో, ZPTC కట్టలు ZPTC డ్రమ్ములో వేసి బాగా కలపాలి (Mixing).
దశ-2: వివరణాత్మక లెక్కింపు (1,000 ఓట్లు)
- ప్రతి టేబుల్‌కు 40 కట్టలు × 25 = 1,000 బ్యాలెట్లు ఇస్తారు (డ్రమ్ము నుండి రాండమ్‌గా).
- ఏజెంట్లకు చూపిస్తూ అభ్యర్థుల వారీగా ఓట్లు వేరు చేయాలి: అభ్యర్థులు + NOTA + Doubtful (సందేహాస్పదం).
- సందేహాస్పద ఓట్లను RO నిర్ణయానికి పంపాలి.
- ప్రతి అభ్యర్థి చెల్లిన ఓట్లను 50 ఓట్ల కట్టలుగా కట్టాలి (మిగిలిన ఓట్ల సంఖ్య స్లిప్ పెట్టాలి).
- Proforma-C2 నింపి సంతకాలు: Valid + NOTA + Rejected = 1,000 కావాలి.
6. చెల్లుబాటు (Valid) & చెల్లని (Invalid) ఓట్లు
ప్రధాన సూత్రం: బ్యాలెట్ పేపర్‌పై ఉన్న స్వస్తిక్ ముద్ర (Arrow Cross Mark) ఏ అభ్యర్థికి వేసినదో, ఓటరు ఉద్దేశం (Intention) స్పష్టంగా తెలిస్తే ఆ ఓటు చెల్లుతుంది.
చెల్లే సందర్భాలు (Valid)
- మడత వల్ల ఎదురు గడిలో మసక ముద్ర పడినా, అసలు ముద్ర ఉన్న అభ్యర్థికి ఓటు చెల్లుతుంది.
- ముద్రతో పాటు సిరా మరక ఉన్నా, స్పష్టమైన ముద్ర ఉన్న అభ్యర్థికి చెల్లుతుంది.
- ఒకే అభ్యర్థి గడిలో రెండు ముద్రలు ఉన్నా, ఉద్దేశం స్పష్టమైతే చెల్లుతుంది.
- ముద్ర గడి గీత దాటినా, ఏ అభ్యర్థికో స్పష్టంగా తెలిస్తే చెల్లుతుంది.
చెల్లని సందర్భాలు (Invalid)
- ఏ గుర్తు లేని ఖాళీ బ్యాలెట్
- ముద్ర వేయకుండా ఇతర గుర్తు/రాత (స్వస్తిక్ కాని ముద్ర)
- ఇద్దరు/ఎక్కువ అభ్యర్థులకు ఓటు వేయడం
- ఓటరును గుర్తించగల రాత/సంతకం/గుర్తు ఉన్నవి
- ఇద్దరు అభ్యర్థుల మధ్య గీతపై ముద్ర (ఎవరికో స్పష్టత లేనిది)
- నకిలీ (Spurious) లేదా గుర్తింపు మార్క్ లేని బ్యాలెట్
RO నియమాలు: (1) కౌంటింగ్ టేబుల్ సిబ్బంది ఏ బ్యాలెట్‌నూ తిరస్కరించకూడదు; సందేహాస్పదాలను RO కు పంపాలి. (2) తిరస్కరించిన ప్రతి బ్యాలెట్‌పై RO స్వయంగా “REJECTED” అని స్టాంప్ వేసి సంతకం చేస్తారు.
7. లెక్కింపు పత్రాల నమూనా (Proforma-C1 & Proforma-C2)
Proforma-C1 (Stage-1 Tally / Sheet-A): పోలింగ్ స్టేషన్ వారీగా పోలైన ఓట్లు, సీళ్లు, 25 కట్టలు + లూజ్ పేపర్లు (MPTC గులాబీ, ZPTC తెలుపు), మొత్తం సరిపోలిందా (Y/N). సంతకాలు: Asst-1 | Asst-2 | Supervisor (ఏజెంట్ల సంతకాలు అవసరం లేదు).
| PS No. | పోలైన ఓట్లు | సీళ్లు చూపారా | PINK (MPTC): కట్టలు + లూజ్ = మొత్తం | WHITE (ZPTC): కట్టలు + లూజ్ = మొత్తం | Tally OK? |
|---|---|---|---|---|---|
| ఉదా: 13/1 | 1,082 | Yes | 43 + 7 = 1,082 | 43 + 7 = 1,082 | Y |
Proforma-C2 (Stage-2 Round-wise / Sheet-B) – MPTC కి ఒక షీట్, ZPTC కి ఒక షీట్ (ప్రతి రౌండ్‌కు 1,000 ఓట్లు). నమూనా ఉదాహరణ:
| వ.సం. | అభ్యర్థి | వచ్చిన ఓట్లు |
|---|---|---|
| 1 | అభ్యర్థి-1 | 415 |
| 2 | అభ్యర్థి-2 | 315 |
| 3 | అభ్యర్థి-3 | 156 |
| 4 | అభ్యర్థి-4 | 48 |
| 5 | అభ్యర్థి-5 | 21 |
| మొత్తం చెల్లిన ఓట్లు | 955 | |
| NOTA | 17 | |
| REJECTED (RO నిర్ణయం) | 28 | |
| GRAND TOTAL | 955 + 17 + 28 = 1,000 |
సంతకాలు: Asst-1 | Asst-2 | Supervisor + కౌంటింగ్ ఏజెంట్లు.
8. సమాన ఓట్లు (Tie), రీకౌంట్ & ఫలితం ప్రకటన
- లెక్కింపు పూర్తయ్యాక RO ఫలితాల షీట్ నింపి, ఓట్ల వివరాలను ప్రకటిస్తారు.
- రీకౌంట్: అభ్యర్థి/ఏజెంట్ అభ్యర్థన చేస్తే, రూల్స్ ప్రకారం RO పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఫలితం ప్రకటించాక రీకౌంట్ హక్కు ఉండదు.
- సమాన ఓట్లు: ఇద్దరు/ఎక్కువ అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే RO లాటరీ (Draw of Lots) ద్వారా నిర్ణయిస్తారు.
- ఫలితాల ప్రకటన తర్వాత RO గెలిచిన అభ్యర్థికి ఎన్నిక సర్టిఫికెట్ అందజేస్తారు (MPTC & ZPTC వేరు వేరుగా).
9. లెక్కింపు తర్వాత ప్యాకింగ్ & సీలింగ్
| ప్యాకెట్ రకం | ప్యాకింగ్ విధానం | సీళ్లు |
|---|---|---|
| వాడిన బ్యాలెట్లు (Used Ballots) | అభ్యర్థుల వారీ కట్టలు, చెల్లిన / తిరస్కరించిన / NOTA / ఆలస్యంగా వచ్చిన పోస్టల్ కవర్లు వేరు వేరు ప్యాకెట్లలో; MPTC & ZPTC వేరు | RO + అభ్యర్థులు/ఏజెంట్ల సీళ్లు |
| PO నుండి వచ్చిన డాక్యుమెంట్లు (Unused Ballots, Counterfoils, Marked Roll, Tendered) | కౌంటింగ్ సిబ్బంది తెరవరాదు; వచ్చిన విధంగానే భద్రపరచాలి | RO + ఏజెంట్ల సీళ్లు |
10. కౌంటింగ్ రోజు 30-పాయింట్ల చెక్‌లిస్ట్
A. రిపోర్టింగ్ & ప్రతిజ్ఞ (1–9)
1) ఉ. 6:00 కి కేంద్రానికి చేరాలి. 2) హాజరు పత్రంలో సంతకం. 3) ID కార్డు తెచ్చుకోవాలి. 4) అల్పాహారం ముగించాలి. 5) ఫోన్లు, లగేజీ డిపాజిట్ చేయాలి. 6) టేబుల్ కేటాయింపు (రాండమైజేషన్) తెలుసుకోవాలి. 7) కేటాయించిన టేబుల్ వద్దకు వెళ్లాలి. 8) ఫారమ్స్ వచ్చాయో లేదో చూడాలి. 9) స్టేషనరీ తీసుకోవాలి.
B. బ్యాలెట్ బాక్సులు తెరవడం (10–17)
10) వచ్చిన బాక్సు PS నంబర్ నమోదు. 11) బాక్సు అడ్రస్ ట్యాగ్ చూపించాలి. 12) బాక్సు నంబర్, సీళ్లు ఏజెంట్లకు చూపించాలి. 13) గ్రీన్ పేపర్ సీల్ చూపించి బాక్సు తెరవాలి. 14) PS నంబరు, డైరీ నంబరు సరిచూడాలి. 15) అన్ని బ్యాలెట్ పేపర్లను బయటకు తీయాలి. 16) ఖాళీ బాక్సును ఏజెంట్లకు చూపాలి. 17) పేపర్లను MPTC (గులాబీ) & ZPTC (తెలుపు) గా వేరు చేయాలి.
C. దశ-1: 25 కట్టలు & Proforma-C1 (18–22)
18) మడత విప్పకుండా 25 పేపర్ల కట్టలు కట్టాలి. 19) లూజ్ పేపర్ల లెక్క. 20) Proforma-C1 పూర్తి చేయాలి. 21) కట్టలను తీసుకెళ్లి RO అనుమతితో MPTC/ZPTC డ్రమ్ముల్లో వేయాలి. 22) అన్ని PS ల Initial Counting పూర్తి చేయాలి.
D. దశ-2: 50 కట్టలు & Proforma-C2 (23–30)
23) 40 కట్టలు (1,000 ఓట్లు) టేబుల్‌కు వస్తాయి. 24) ఒక్కో బ్యాలెట్ ఏజెంట్లకు చూపిస్తూ అభ్యర్థుల వారీగా వేరు చేయాలి; NOTA, Invalid వేరుగా. 25) ఓట్లను 50 కట్టలుగా కట్టి Proforma-C2 నింపాలి. 26) రౌండ్ ముగిశాక కట్టలను RO వద్ద అభ్యర్థుల ట్రేలలో ఉంచాలి. 27) మొత్తం సరిచూడాలి (1,000). 28) ఏజెంట్లతో వాదనలు వద్దు; సందేహాలు RO దృష్టికి. 29) Proforma-C2 పై సిబ్బంది & ఏజెంట్ల సంతకాలు. 30) పూర్తి చేసిన పత్రాలను RO కు అందజేయాలి.

0 comments:
Post a Comment