AP DEECET-2026 PHASE-II COUNCILLING SCHEDULE
TIME SCHEDULE FOR AP DEECET-2026 PHASE-II
ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET-2026)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డి.ఎల్. ఎడ్. కళాశాలలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ నిమిత్తం రెండవ దశ కౌన్సెలింగ్ (Phase-II) నిర్వహించబడుతున్నది.
రెండవ దశ కౌన్సెలింగ్లో భాగంగా అర్హత సాధించిన అభ్యర్థులు 13-08-2026 నుండి 16-08-2026 వరకు వెబ్ ఆధారిత (Web-Based) ఆప్షన్లు నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది.
అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా 17-08-2026 నుండి 20-08-2026 వరకు సీట్ల కేటాయింపు (Seat Allotment) నిర్వహించబడును. సీట్లు కేటాయించబడిన అభ్యర్ధులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను (Provisional Admission Letters) అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
సీట్లు కేటాయించబడిన అభ్యర్ధులు 21-08-2026 నుండి 24-08- 2026 వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ (DIET) కళాశాలలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం (Final Admission Letter) పొందవలెను.
డి.ఎల్.ఎడ్. మొదటి సంవత్సరం తరగతుల మొదటి రోజు బోధన 27-08-2026 నుండి ప్రారంభమగును.
కావున, AP DEECET-2026లో అర్హత సాధించిన మరియు రెండవ దశ కౌన్సెలింగ్కు అర్హులైన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని, సీట్లు కేటాయించబడిన పక్షంలో నిర్ణీత తేదీలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై, తమకు కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోగా ప్రవేశం పొందవలసిందిగా శ్రీ బి. లింగేశ్వర రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, AP DEECET-2026 & ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, గుంటూరు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
TIME SCHEDULE FOR AP DEECET-2026 PHASE-II
| S.No | ITEM | DEECET-2026 |
| 1 | Submission of web-based options by the candidates |
13-08-2026 to 16-08-2026 |
| 2 | Allotment of seats to candidates, issue of provisional letters of admission | 17-08-2026 to 20-08-2026 |
| 3 | Verification of certificates at DIET's and issue of Final Admission letter | 21-08-2026 to 24-08-2026 |
| 4 | First day of Instruction | 27-08-2026 |
For Official Website Click here


0 comments:
Post a Comment