HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

ఏపీ టెట్ డిఎస్‌సి తెలుగు - దిగంబర కవిత్వం – పరిచయం స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్

ఏపీ టెట్ డిఎస్‌సి తెలుగు దిగంబర కవిత్వం – పరిచయం స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here



దిగంబర కవిత్వం – పరిచయం:-

1 )తెలుగుదేశంలో దిగంబర కవిత్వానికి నాంది పలికిన సంవత్సరం?

A) 1965

2 ) “దిగంబర కవిత్వం" ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాయబడింది?

A) 1965 - 1968 

3) "అభ్యుదయ కవితా ధోరణులు" పై తిరుగుబాటుగా వచ్చిన కవిత్వం?

A) దిగంబర కవిత్వం

4) "ప్రాచీన సాహిత్యం పట్ల, ప్రబంధ కవిత్వం పట్ల, అకాడమీల పట్ల, సెక్స్ సాహిత్యం పట్ల తీవ్ర వ్యతిరేకతతో వచ్చిన కవిత్వం"?

A) దిగంబర కవిత్వం

5) "ఈ దేశంలో, ఈ భూగోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి, అతని భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి, పిచ్చెత్తి ప్రవచించిన కవిత్వం"?

A) దిగంబర కవిత్వం

దిగంబర కవులు - పరిచయం:-

6) ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించిన కవులు?

A) దిగంబర కవులు

7) దిక్కులు అంబరంగా గల కవులు?

A) దిగంబర కవులు

8) తెలుగుదేశంలో దిగంబర కవిత్వానికి సారధ్యం వహించిన కవులు?

1) నగ్నముని

2) నిఖిలేశ్వర్

3) చెరబండరాజు

4) జ్వాలాముఖి

5) మహాస్వప్న

6) బైరవయ్య

9) “దిగంబర కవులు”యొక్క అసలు పేర్లను గుర్తించండి?

1) నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు

2) నిఖిలేశ్వర్ - యాదవరెడ్డి

3) చెరబండరాజు- బద్దం భాస్కరరెడ్డి

4) జ్వాలాముఖి - వీరవెల్లి రాఘవాచార్యులు

5) మహాస్వప్న - కమ్మి శెట్టి వెంకటేశ్వరరావు

6) బైరవయ్య - మన్ మోహన్ సహాయ్

10) దిగంబర కవులను "ఆగ్నేయ కవులు" అని పిలిచినవారు?

A) నిఖిలేశ్వర్

11) దిగంబర కవులను "బజారు కవులు" అని పిలిచినవారు?

A) నగ్నముని

12) "దిగంబర కవులు" అనే పేరును సూచించిన వారు?

A) నగ్నముని

13) తెలుగు సాహితీ లోకానికి పెద్ద "షాక్ ట్రీట్ మెంట్" ఇచ్చిన కవులు?

A) దిగంబర కవులు

14) భావకవిని స్త్రీవా? కొజ్జావా? అని ప్రశ్నించిన కవులు?

A) దిగంబర కవులు

15) భారతీయ సంస్కృతి పట్ల, నాగరికత పట్ల, పూర్తిగా క్షీణిస్తున్న మానవ విలువల పట్ల ధ్వజమెత్తి కవులు?

A) దిగంబర కవులు

16) కవితా స్వరూపాన్ని బట్టి స్వభావాన్ని బట్టి మేము రాస్తున్న దాన్ని వచన కవిత అని మేము అనదలుచుకోలేదు" ఈ మాటలు అన్న కవులు?

A) దిగంబర కవులు

17) "వచన కవిత అనే పదం మాకు నచ్చదు" అని ప్రకటించిన కవులు?

A) దిగంబర కవులు

18) తెలుగు సాహితీ లోకానికి "కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయడానికి" వస్తున్నామన్న కవులు?

A) దిగంబర కవులు

దిగంబర కవిత్వం - నిర్వచనం:-

19) "పతితమైన జాతికి మానవతను చూపేందుకు అవసరమైన జాగృతిని కలిగించేందుకు చేస్తున్న ధ్వంసరచననే దిగంబర కవిత్వం అంటారు" ఈ మాటలు అన్నవారిని గుర్తించండి?

A) ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి

20) “మానిషాదశోకంలో నుండి వేదనావల్మీకంలో నుండి ఆవిర్భవించిన కవిత్వమే దిగంబర కవిత్వం" > ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి



21) "మానవత రెండు కళ్ళు మూసుకుపోయిన సమయంలో మూడో కన్ను విప్పుకుంటూ తుఫానుగా వచ్చిన కవిత్వమే దిగంబర కవిత్వం" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి

దిగంబర కవులు – ప్రకటించిన సంవత్సరాలు:-

22) దిగంబర కవులు ప్రకటించిన సంవత్సరాలు?

1) నగ్న నామ సంవత్సరం

2) నిఖిలేశ్వరనామ సంవత్సరం

3) జ్వాలాముఖినామ సంవత్సరం

4) చెరబండనామ సంవత్సరం

5) బైరవనామ సంవత్సరం

6) మహాస్వప్న నామ సంవత్సరం

దిగంబర కవులు - ప్రకటించిన ఋతువులు:-

23) దిగంబర కవులు ప్రకటించిన ఋతువులు?

1) ఆశ ఋతువు

2) తపన ఋతువు

3) అశ్రు ఋతువు

4) మదిర ఋతువు

5) విరహ ఋతువు

6) విషాద ఋతువు

దిగంబర కవులు - ప్రకటించిన వారాలు:-

24) దిగంబర కవులు ప్రకటించిన వారాలు?

1) స్నేహవారం

2) విశృంఖలవారం

3) క్షాంతివారం

4) సృజనవారం

5) వికాసవారం

6) అనంతవారం

దిగంబర కవితా సంకలనాలు కవితలు

25) దిగంబర కవులు వెలువరించిన మొత్తం కవితా సంకలనాలు ఎన్ని?

A) మూడు

26) దిగంబర కవులు మూడు కవితా సంకలనాల్లో రాసిన మొత్తం కవితలు?

A) 93 

27) దిగంబర కవులు వెలువరించిన మూడు కవితా సంకలనాల్లో "నగ్నముని" రాసిన ఎన్ని కవితలుఉన్నాయి?

A) 25 

28) దిగంబర కవులు వెలువరించిన మూడు కవితా సంకలనాల్లో "నిఖిలేశ్వర్" రాసిన ఎన్ని కవితలు ఉన్నాయి?

A) 24 

29) దిగంబర కవులు వెలువరించిన మూడు కవితా సంకలనాల్లో "చెరబండరాజు" రాసిన ఎన్ని కవితలు ఉన్నాయి?

A) 20 

30) దిగంబర కవులు వెలువరించిన మూడు కవితా సంకలనాల్లో "బైరవయ్య" రాసిన ఎన్ని కవితలు ఉన్నాయి?

A) 12 

31) దిగంబర కవులు వెలువరించిన మూడు కవితా సంకలనాల్లో "జ్వాలాముఖి" రాసిన ఎన్ని కవితలు ఉన్నాయి?

A) 6 కవితలు

32) దిగంబర కవులు వెలువరించిన మూడు కవితా సంకలనాల్లో "మహాస్వప్న" రాసిన ఎన్ని కవితలుఉన్నాయి?

A) 6 కవితలు

33) దిగంబర కవులు"యొక్క మూడు కవితా సంపుటాలను అనువదించి "కేంద్రీయ సంస్థాన అవార్డు" పొందినవారు?

A) ఆచార్య రామానాయుడు

దిగంబర కవితా సంకలనాలు- ఆవిష్కర్తలు:-

34) దిగంబర కవులు యొక్క మొదటి కవితా సంకలనం ఏ సంవత్సరంలో ఆవిష్కరించబడింది?

A) 1965 మే 6వ తేదీన అర్ధరాత్రి ఆవిష్కరించబడింది.

35) దిగంబర కవులు యొక్క మొదటి కవితా సంకలనమును ఆవిష్కరించిన వారిని గుర్తించండి?

A) హైదరాబాద్ లో "నాంపల్లి పాండు" అనే రిక్షా కార్మికుడు.

36) దిగంబర కవులు యొక్క మొదటి కవితా సంకలనం ఏ శకంలో ఆవిష్కరించబడింది?

A) దిగంబర శకం

37) దిగంబర కవులు తమ మొదటి కవితా సంకలనమును 1965లో ఆవిష్కరించారు కదా!ఈ సంవత్సరానికి వారు పెట్టిన పేరును గుర్తించండి?

A) నగ్న నామ సంవత్సరం

38) దిగంబర కవులు తమ మొదటి కవితా సంకలనమును ఈ ఋతువులో ఆవిష్కరించారు?

A) ఆశ ఋతువు

39) దిగంబర కవులు యొక్క రెండవ కవితా సంకలనం ఏ సంవత్సరంలో ఆవిష్కరించబడింది?

A) 1966 డిసెంబర్ 8వ తేదీన ఆవిష్కరించబడింది.

40) దిగంబర కవులు యొక్క రెండవ కవితా సంకలనమును ఆవిష్కరించిన వారిని గుర్తించండి?

A) విజయవాడలో "జంగాల చిట్టి" అనే హోటల్ కార్మికుడు



41) దిగంబర కవులు యొక్క రెండవ కవితా సంకలనం ఏ శకంలో ఆవిష్కరించబడింది?

A) దిగంబర శకం

42) దిగంబర కవులు తమ రెండవ కవితా సంకలనమును 1966లో ఆవిష్కరించారు కదా! ఈ సంవత్సరానికి వారు పెట్టిన పేరును గుర్తించండి?

A) నిఖిలేశ్వరనామ సంవత్సరం

43) దిగంబర కవులు తమ రెండవ కవితా సంకలనమును ఈ ఋతువులో ఆవిష్కరించారు?

A) మదిర ఋతువు

44) దిగంబర కవులు యొక్క మూడవ కవితా సంకలనం ఈ సంవత్సరంలో ఆవిష్కరించబడింది?

A) 1968 జూన్ లో ఆవిష్కరించబడింది.

45) దిగంబర కవులు యొక్క మూడవ కవితా సంకలనమును ఆవిష్కరించిన వారిని గుర్తించండి?

A) విశాఖపట్నంలో "ఎడమనూరి యశోద" అనే బిచ్చగత్తె.

46) దిగంబర కవులు యొక్క మూడవ కవితా సంకలనం ఈ శకంలో ఆవిష్కరించబడింది?

A) దిగంబర శకం

47) దిగంబర కవులు తమ మూడవ కవితా సంకలనమును 1968లో ఆవిష్కరించారు కదా!ఈ సంవత్సరానికి వారు పెట్టిన పేరును గుర్తించండి?

A) జ్వాలాముఖినామ సంవత్సరం

48) దిగంబర కవులు తమ మూడవ కవితా సంకలనమును ఈ ఋతువులో ఆవిష్కరించారు?

A) విషాద ఋతువు

దిగంబర కవిత్వం - లక్షణాలు:-

49) “దిగంబర కవితా లక్షణాలు"ను గుర్తించండి? IMP

1) తిరుగుబాటుతనం విశృంఖలత్వం

2) అంతర్జాతీయ భావం

3) అణుయుద్ధ విముఖత

4) నగర జీవనచిత్రణం

5) వ్యక్తి స్వేచ్ఛ- నూతన వ్యవస్థ స్థాపన

6) వర్గపోరాటతత్వం- సాయుధ విప్లవం

దిగంబర కవులు - కవితలు:-

50) దిగంబర కవులు తమ కవితలను ఏమని పిలిచారు?

A) దిక్ లు

నగ్నముని:-

51) "నగ్నముని" రాసిన దిగంబర కవితలు?

1)దాహం

2) కాస్మిక్ జాతికోసం

3) జైల్లో సముద్రం

4) తొడవిరిగినతరం

5) కుష్టురోగి

6) బ్రహ్మపదార్ధం

7) కొజ్జాల కామకేళి చూస్తున్నాను

8) నగ్న శిశువు

9) దెయ్యం దీవించాలి

10) దిగంబర నృత్యం

52) "నగ్న ముని" దిగంబర కవి కాకముందు రాసిన కవితా సంపుటి?

A) ఉదయించని ఉదయాలు

53 ) "భూమి ముసలి వరిబీజములా ఉన్నది భూమి కడగని ఎండిన పీత ముడ్డిలా ఉన్నది" అన్న దిగంబర కవి?

A) నగ్నముని

54) "అశ్లీలం పలుకుతోంది దిగంబరాక్షరం" అన్న దిగంబర కవి?

A) నగ్నముని

55) “ఊఁ లే! ముసుగు తొలగించు, ఈ కంపు కొట్టే బట్టల్ని విప్పి ఆత్మ ముందు నిలబడి నిన్ను నీవు చూసుకో" అన్న దిగంబర కవి?

A) నగ్నముని

56) “కోడిపందాలకీ, గొర్రెపందాలకి కుత్తుకలు తెగ్గోసుకునే ఓ ఆంధ్రదేశమా!" అంటూ "నగ్నముని”రాసిన కవిత?

A) కాస్మిక్ జాతికోసం

57) "కారంలో పొర్లించిన రోకళ్లతో పట్టపగలు విషయించాలనుంది" అంటూ "నగ్నముని" రాసిన కవిత?

A) కాస్మిక్ జాతికోసం

58) “ఈ లోకాన్ని వదలి దేవుడుగాడు చచ్చాడు" అంటూ "నగ్నముని" రాసిన కవిత?

A) దెయ్యం దీవించాలి

59) "సూర్యునికి అడ్డంగా నిలుచున్న ఆ మబ్బుతునక పేరేమిటి?" అంటూ "నగ్నముని” రాసిన ร่วง?

A) జైల్లో సముద్రం

60) “అశ్లీలం పలుకుతోంది దిగంబరాక్షరం అంటున్నావు సిగ్గు లేకుండా నీ మెదడు పురుగు తినేసింది" అంటూ "నగ్నముని" రాసిన ఈ పాదాలు ఈ కవితలో కలవు?

A) కొజ్జాల కామకేళి చూస్తున్నాను

61) "ప్రజలు దిగంబరం కావాలి దేశాలు దిగంబరం కావాలి" అన్న కవిని గుర్తించండి?

A) నగ్నముని



నిఖిలేశ్వర్:-

62) “నిఖిలేశ్వర్” రాసిన దిగంబర కవితలు?

1) ఆత్మయోని

2) ఎప్పుడూ ఏడ్వలేదని

3) ఆహ్వానిస్తున్నాను

4) యాదకీయాలు

5) దేవడు - బిర్బరులు

6) సమాధుల చుట్టూ మంటలు

63) “నిఖిలేశ్వర్” రాసిన కవితా సంపుటి?

A) మండుతున్న తరం

64) "భావకవుల నపుంసక హావభావాలకు సవాల్, అభ్యుదయకవీ నల్లమందు తిని నిద్రపోయావ్" అంటూ భావ, అభ్యుదయ కవిత్వాలపై తిరుగుబాటు చేసిన దిగంబర కవి?

A) నిఖిలేశ్వర్

65) “ఈ దేశం క్యాలెండర్లపై మేం తారీఖులం" అన్న దిగంబర కవి?

A) నిఖిలేశ్వర్

66) “మరి ఎందుకలా నిన్ను నరుక్కొన్నావ్" అన్న కవిని గుర్తించండి?

A) నిఖిలేశ్వర్

67) “నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి లేపకు" అంటూ "నిఖిలేశ్వర్” రాసిన ఈ పాదాలు ఈ కవితలో కలవు?

A) ఆత్మయోని

68) “ఈ దారుణ దారిద్ర్య భీకర విషఖండంలో ఈ గొంతులు కోసే వ్యవస్థలో" అంటూ దిగంబర కవితను రాసినవారు?

A) నిఖిలేశ్వర్

69) "అధికారాన్ని ఔపాసన పట్టినవాడా, ఎన్నడైనా గుడిసె గడప ముందు ప్రశాంతంగా నిద్రించిన శవాన్ని చూశావా?" అంటూ ప్రశ్నించిన దిగంబర కవి?

A) నిఖిలేశ్వర్

70) “నా దేశంలో నేను ఏకాకిని" అన్న దిగంబర కవి?

A) నిఖిలేశ్వర్

చెరబండరాజు:-

71) “చెరబండరాజు" రాసిన దిగంబర కవితలు?

1) నన్నెక్కనివ్వండి బోను

2) చూడలేను

3)కో 

4)ఫో

5) వందేమాతరం

6) ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది.

8) చితిపేర్చుకుందాం

7) జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త

72) "ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది" అంటూ "చెరబండరాజు" రాసి ఈ పాదాలు ఈ కవితలో కలవు?

A) వందేమాతరం

73) "దేశమేదైతేనేం మట్టంతా ఒక్కటే అమ్మ ఎవరైతేనేం చనుబాల తీపంతా ఒక్కటి" అంటూ “చెరబండరాజు” రాసిన కవిత?

A) నన్నెక్కనివ్వండి బోను

74) “ప్రాణాన్ని పణంగా పెట్టయినా, ఈ జగతికి మానవతా భిక్ష పెట్టు" అన్న దిగంబర కవి?

A) చెరబండరాజు

75) "మనిషి మీద నమ్మకం పోగొడుతున్న మీరుదేవుడి మీద ప్రమాణం చేయమంటారెందుకు"? అని ప్రశ్నించిన దిగంబర కవి?

A) చెరబండరాజు

76) "దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం వల్లించిందే వల్లించి వాదిస్తారు ఫీజు కుడితికుండలో న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు" అన్న దిగంబర కవి?

A) చెరబండరాజు

77) "మీ రాత్రి చొక్కాలు పగుళ్లు నిలవవు పగటి చొక్కాలు రాత్రి ఉండవు" అనే పాదాలు" చెరబండరాజు" రాసిన ఈ కవితలో కలవు?

A) నన్నెక్కనివ్వండి బోను

78) "మనిషీ నువు నిలద్రొక్కుకు నిలవనపుడు చీకటికి, నైరాశ్య ఊపిరికీ, ఇంకా ఇంకా నువ్వింకా బానిసవే" అంటూ "చెరబండరాజు" రాసిన పాదాలు ఈ కవితలో కలవు?

A) చూడలేను

79) "వందనల సంకుచిత సహజీవనాల్లో కుంచించుకుపోయి జాతిమతాల నెమరేసే యుగాల రోగపీడితుల్ని, పండితుల్ని, పశువుల్ని, నపుంసక భావుకుల్ని నా కవితలు నా మనుష్య ప్రపంచంలోకి నడిపిస్తున్నాయ్" అంటూ "చెరబండరాజు" రాసిన ఈ పాదాలు ఈ కవితలో కలవు?

A)కో

80) "అడుగు అడుగులో సహారా ఎడారి ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద, ఒక్కొక్క హిమాలయం" అంటూ “చెరబండరాజు” రాసిన ఈ పాదాలు ఈ కవితలో కలవు?

A)ఫో



జ్వాలాముఖి:-

81) "జ్వాలాముఖి” రాసిన దిగంబర కవితలు?

1) సూర్యస్నానం

2) కిలికించితం

3) పునర్ యోని ప్రవేశం

4) శస్త్రచికిత్స

5) అవలోకన

82) "చచ్చిన రాజుల పుచ్చిన గాధల మెచ్చే చచ్చుచరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది, మానవ పరిణామశాస్త్రం నేర్పిందేమని?" అంటూ "జ్వాలాముఖి” రాసిన కవిత?

A) సూర్యస్నానం

83) "సమస్యలకు లోతులు తీసి, సామాన్యులను గోతుల్లో తోసి పరిపాలించే పిడికెడు మేధావులకు పిరామిడ్లు కట్టాలనుంది" అంటూ "జ్వాలాముఖి” రాసిన ร่วง?

A) సూర్యస్నానం

84) "స్వార్ధపరత్వపు వేశ్యారతిలో, ఆనంద పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ అసలు కర్తవ్యాన్ని వదిలేస్తున్నాం, అజ్ఞానపు తిమిరాన్ని నమిలేస్తున్నాం" అన్న దిగంబర కవి?

A) జ్వాలాముఖి

85) "సమాజం కొలనులో అశుద్ధాన్ని శాశ్వతంగా కలుపుతున్నాయి" అంటూ "జ్వాలాముఖి” రాసిన కవిత?

A) కిలికించితం

86) "నంగనాచి నాగరికతను నగ్నం చేసి

నవమధువున సూర్యస్నానం చేయించి న్యూయార్కు నగర వేదికన నీగ్రో వీరునితో నూడ్ ట్విస్ట్ తాండవం చేయిండాలి" అన్న దిగంబర కవి?

A) జ్వాలాముఖి

87) “బోధివృక్షం పిడికెడు నీడనియ్యలేదు.గాంధీపధం గరిటెడు గంజిపోయలేదు" అన్న దిగంబర కవి?

A) జ్వాలాముఖి

మహాస్వప్న :-

88) "మహాస్వప్న" రాసిన దిగంబర కవిత?

A) గ్లానిర్భవతి భారతి

89) "మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు" అన్న దిగంబర కవి?

A) మహాస్వప్న

90) “మానిషాద శ్లోకంలోంచి వేదనా వల్మీకంలోంచి నేను వస్తున్నాను దిగంబర కవినై" అంటూ "మహాస్వప్న "రాసిన కవిత?

A) గ్లానిర్భవతి భారతి

91) "మానవత రెండు కళ్ళు మూసుకుపోయినప్పుడు

విప్పుకుంటున్న మూడో కన్నుపై, నేను వస్తున్నాను, దిగంబర కవిని, రాత్రి ఉదయిస్తున్న రవిని" అన్న కవిని గుర్తించండి?

A) మహాస్వప్న

92) “రాజకీయాల్లో ధర్మ శాస్త్రాల్లో వీర్యస్థలనం చేసుకున్నాను భూగోళాన్ని శిశ్న శిఖరాగ్రం మీద నిలబెట్టాను" అన్న కవిని గుర్తించండి?

A) మహాస్వప్న

భైరవయ్య:-

93) “బైరవయ్య” రాసిన దిగంబర కవితలు?

1) దిగంబరి

2) చెరచబడ్డ గీతం

3) నేనూ దేవుణ్ణి నమ్ముతున్నాను

4) నరమాంసం రుచిమరిగి

94) "ఇవి నిజాలు నిత్యం మండే యథార్ధాలు" అంటూ "బైరవయ్య" రాసిన కవిత?

A) దిగంబరి

95) "మీ గుండెలు కుతకుత ఉడుకెత్తాలి ఉడుకెత్తిన గుండెల్లో కొత్తరక్తం పుట్టాలి" అంటూ "బైరవయ్య" రాసిన కవిత?

A) దిగంబరి

96) “ఒరేయ్ పేనుకు పెత్తనమిచ్చిన పెయ్యమ్మలు" అనే దిగంబర కవితను రాసినవారు?

A) బైరవయ్య

దిగంబర కవిత్వం – విమర్శకులు:-

97) “వాళ్ళు నిజమైన కవులు. అయితే వాళ్ళ కవితాశక్తుల్ని సరియైన మార్గంలో పెట్టలేకపోతున్నారు. వాళ్ళలోని అశాంతిని సరియైన మార్గంలో పెడితే బాగుంటుంది. దిగంబరకవులు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు కనబడిన ప్రతిదానిమీద తిరగబడుతున్నారు. వాళ్ళు అనార్కిస్టులనుకోవాలో, మార్క్సిస్టులనుకోవాలో తెలీదు. ఎక్కువ అనార్కిస్టులుగానే కనిపిస్తున్నారు." ఈ మాటలు అన్నది?

A)శ్రీ  శ్రీ

98) "లోకంలో అశ్లీలార్ధం వున్న పదం సాహిత్యంలో అశ్లీలమై తీరుతుందని చెప్పలేం. లోకంలో అశ్లీలార్ధంలేని పదాలతో అశ్లీలార్ధం సాహిత్యంలో కలిగించలేమని చెప్పలేం. లైంగిక ప్రసక్తి ఉన్నంతమాత్రాన అశ్లీలం అని నిర్ణయించడానికి వీలులేదు" ఈ మాటలు అన్నది?

A) డాక్టర్ వెల్చేరు నారాయణరావు

99) “దిగంబరకవులు రాకపోతే అభ్యుదయకవులు శక్తిని కోల్పోయినప్పుడు ఏర్పడిన స్తబ్దత చెదిరి పోయేదికాదు. యువకవులు కర్తవ్యాన్ని గుర్తించేవారుకారు. ఈ విధంగా దిగంబరకవిత్వోద్యమం ఒక చారిత్రక బాధ్యతగా వెలువడిందని చెప్పవచ్చు.

A) డాక్టర్ కడియాల రామమోహనరాయ్

100) "మానవులంతా ఒక కొత్త కుటుంబంగా ఏర్పడటం గురించి కలగని, అది నిజం కావాలన్న ఆశతో, ఆవేశంతో, కవితా కరదీపికలతో నిజాయితీగల అన్వేషణగా సాగిన దిగంబర కవితా ఉద్యమం తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి



101) "దిగంబరకవులు ఆధునిక కవిత్వంలో ఒక కొత్తదారి చూపారు. ఇది నిజమైన విప్లవం. తిరుగుబాటు కవిత్వం. ఈ కవిత్వం ప్రజలకు ఈనాడు అవసరం" ఈ మాటలు అన్నవారిని గుర్తించండి?

A) శ్రీ కొడవటి గంటి కుటుంబరావు

102) "కవిత్వం మాత్రం ఎక్కడాలేదు. వీళ్ళ రచనలు చదివితే అసహ్యం వేస్తుంది. ఆ తిట్లూ, ఆ బూతు లూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒళ్లు ఎరుగని కుసంస్కారమూ, ఆ నోటితీటా, ఆ మాటలకంపు మనకు జుగుప్స కలిగిస్తాయి. గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నీచమై న, కుసంస్కారమైన రచన ఎప్పుడూ రాలేదు" ఈ మాటలు అన్నవారిని గుర్తించండి?

A) శ్రీ రాచమల్లు రామచంద్రారెడ్డి

103)“దిగంబర కవితోద్యమం తాటాకుల మంటలా ఎలా వచ్చిందో అలా పోతుంది” ఈ మాటలు అన్నది?

A) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

104) "విశ్వనాథ మార్పుకు బద్ధశత్రువు. అందుకే విద్యుద్దీపాలకన్నా ఆముదపు దీపాలే వేయిపడగల వెలుగునిస్తాయి" అని ప్రతివిమర్శ చేసినవారు?

A) దిగంబర కవులు

105) “దిగంబర కవులది తిట్టు కవిత్వం. అశ్లీల పదప్రయోగం తిట్టు కవితకు మెరుగులుదిద్ది పదును పెడుతున్నది" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) ఆచార్య కె.వి.ఆర్. నరసింహం

106) "రామచంద్రారెడ్డి గారు ఆక్షేపించారేకానీ, వీళ్ళ కవిత్వంలో నిజాయితీని, ధర్మక్రోధాన్ని అన్నింటినీ మించి ప్రతిభావంతులైన వీరి కవిత్వాన్ని ఆస్వాదించ లేకపోయారు. పుడకలు వున్నాయని పానకం పారబోసుకుంటామా? అది సహృదయ లక్షణం కాదుగదా!" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) కడియాల రామమోహన్ రాయ్

107) “దిగంబర కవులది సాహిత్య స్టంటు గుప్తాంగాల వర్ణన. సెక్సు పదాల మోజు ఇవన్నీ మానసిక రుగ్మతకు లక్షణాలు" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) శ్రీ కె.వి. రమణారెడ్డి

108) “దిగంబర కవిత్వోద్యమం సాహిత్య చరిత్రకారులకు ప్రయోజనం కావచ్చునేమోకానీ, సామాజిక వ్యవస్థకు వుపయోగించే గుణం ఇందులో మృగ్యం" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) శ్రీ నూతలపాటి గంగాధరం

109) "దిగంబర కవిత్వం కేవలం తిట్టు కవిత్వంగా కన్పిస్తుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు” ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) ఆచార్య ఆర్.ఎస్. సుదర్శనం

110) “కొత్త పదజాలం ప్రయోగిస్తున్నామనుకొని అసహ్యమైన జుగుప్సాకరమైన పదచిత్రాల వక్రీకృత మానవతాభారాలు పోగులు పోగులుగా పెట్టిన దిగంబరులు సాధించినది మానవజాతికి రుగ్మతనీ,సిఫిలిస్ని, కుష్ఠునీ తప్ప అన్యంకాదు"

A) ఆవంత్స సోమసుందర్

111) "మహాబలిపురంలో పెద్ద అలలువచ్చి మొహానికి తగిలితే కలిగిన షాక్ లాంటి అనుభూతి కలిగిం దన్నారు. అన్యాయాన్ని, అక్రమాన్ని, అమానుషాల్ని ప్రతియుగంలోనూ ప్రతిరంగంలోనూ పత్రికల్లో కవి ఖండిస్తూనే వుంటాడు. కళ్ళముందు దారుణాలు జరుగుతుంటే కవి శపించకమానడు. కానీ ఈ కవులు వాల్మీకిలాకాక కూచిమంచి జగ్గ కవిలా తిడుతున్నారు. అందులో కవిత్వం తగ్గి కసి పెరుగుతున్నది.క్షమించడం చేతకానివాడు దానవుడిగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి" ఈ మాటలు అన్నవారిని గుర్తించండి?

A) ఆరుద్ర

112) "బూతు పరిష్కారం కాదు. తిట్టు మేల్కొల్పుకాదు" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) జ్వాలాముఖి

112) "బూతు పరిష్కారం కాదు. తిట్టు మేల్కొల్పుకాదు" ఈ మాటలు అన్నవారిని గుర్తించండి?

A) జ్వాలాముఖి

113) “వాళ్ళు దూషించినా, భూపించినా విషయ ప్రముఖంగానే కవిత్వం ఆవిర్భవించింది" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

A) ఆచార్య కొలకలూరి ఇనాక్

ముగింపు:-

114) "మేం పుస్తకాల్లో నుండి మాట్లాడదలచుకోలేదు. మేం మేముగా మాట్లాడదలచుకున్నాం" అన్నకవులు?

A) దిగంబర కవులు

115) "లంగా మార్కు సినిమాలు, కరువుబిచ్చం" వంటి పదబంధాలను వాడిన కవులు?

A) దిగంబర కవులు

116) దిగంబర కవులు నుండి బయటకు వచ్చిన కవులు?

1) మహాస్వప్న

2) బైరవయ్య

117) “ఒక విశ్వాసానికి కట్టుబడినవారు మీరు, దానికి కట్టుబడనివాణ్ణి నేను" అంటూ దిగంబర కవులు నుండి బయటకు వచ్చిన కవి?

A) మహాస్వప్న

118) "విప్లవ రచయితల సంఘం"లో చేరిన దిగంబర కవులు?

1) నగ్నముని

2) నిఖిలేశ్వర్

3) చెరబండరాజు

A) జ్వాలాముఖి

119) “దిగంబర కవులు" యొక్క ప్రభావంతో ఒక సంఘంగా ఏర్పడిన కవులు?

1) పైగంబరకవులు

2) తిరుగుబడుకవులు

120) "పైగంబరకవులు"ను గుర్తించండి?

1) సుగమ్ బాబు

2) కిరణ్ బాబు

3) దేవీప్రియ

4) కమలాకాంత్

5) ఓల్గా

121) “యుగచైతన్యం" అనే పేరుతో రెండు కవితా సంకలనాలు వెలువరించిన కవులు?

A) పైగంబరకవులు

122) "తిరుగుబడుకవులు"ను గుర్తించండి?

1) వరవరరావు

2) అశోక్

3) లోచన్

4) కిషన్

5) ఎక్స్-రే

6)ఐ

7) సంజీవరావు

8) సుధారన్

9) సుదర్శన్

10) సంజీవరావు

123 "చలినెగళ్ళు" అనే కవితా సంకలనాన్ని వెలువరించిన కవులు?

A)తిరుగుబాడు కవులు

124) దిగంబర కవితా ఉద్యమం ప్రభావంతో మహారాష్ట్రలో వెలసిన ఉద్యమం?

A) దళిత పాంథర్ ఉద్యమం

125) “దిగంబర కవిత్వం" మొదటి సంపుటి రాకముందు "రాత్రి" అనే కవితా సంకలనంలో కవితలు రాసి, సంచలనం సృష్టించిన కవులు?

A) మానేపల్లి హృషికేశవరావు నగ్నముని

B) యాదవరెడ్డి - నిఖిలేశ్వర్

C) కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు మహాస్వప్న



ఏపీ టెట్ డిఎస్‌సి తెలుగు- దిగంబర కవిత్వం – పరిచయం స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్

0 comments:

Post a Comment

Recent Posts