APTET - JUNE- 2026 Instructions To Apply Online Application
APTET - JUNE- 2026 అభ్యర్థులు దరఖాస్తు నింపు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు దరఖాస్తు నింపే సమయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక ప్రకటనలో తెలియజేసారు.
TET registration form Apply చేయడానికి కావలసిన వివరములు
1. Adhar
2. Mail id
3. Phone number for otp
4. Adress details (include door no.)
5. Caste,sub caste details
6. Parent details
7. Photo with sign below 150 kb for upload
1. దరఖాస్తు నింపడానికి ముందుగా అభ్యర్థి ముందుగా APTET JUne 2026 కు నిర్దేశించిన అధికారిక వెబ్ సైట్ http://tet2dsc.apcfss.in లో మాత్రమే లాగిన్ కావాలి.
2. అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.
3. AP TET అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా One Time Profile Registration (OTPR) http://tet2dsc.apcfss.in పూర్తి చేయవలసిందిగా తెలియచేయడమైనది
a) అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఆధార్ నంబర్), సంప్రదింపు వివరాలు (మొబైల్ నంబర్, ఇమెయిల్ ID), విద్యార్హతలు, చిరునామా వివరాలు నమోదు చేయాలి మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం ను నిర్దేశించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
b) నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థికి ఒక ప్రత్యేక రిఫరెన్స్ ID కేటాయించబడుతుంది మరియు అది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కు పంపబడుతుంది. ఈ రిఫరెన్స్ ID ని AP TET మరియు DSC పరీక్షలకు సంబంధించిన అన్ని దరఖాస్తులు మరియు సంబంధిత సమాచారానికి ఉపయోగించాలి.
c) అభ్యర్థులు దరఖాస్తు సమర్పణకు ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, OTPR ప్రొఫైల్ ప్రింట్ అవుట్ను భద్రపరచుకోవాలి.
4. OTPR యొక్క ఉద్దేశ్యం ప్రతి అభ్యర్థికి ఒక శాశ్వత మరియు ప్రత్యేక ప్రొఫైల్ కేటాయించడం, తద్వారా వారు భవిష్యత్తులో జరిగే AP TET మరియు DSC పరీక్షలకు మళ్లీ వివరాలు నమోదు చేయకుండా సులభంగా దరఖాస్తు చేసుకునే వీలును కల్పించడం.
5. అభ్యర్థికి కేటాయించబడిన క్యాండిడేట్ ఐడి తో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు లోని అన్ని వివరాలను సరైన సమాచారంతో నింపి దరఖాస్తును పూర్తి చేసుకోవాలి.
6. దరఖాస్తు ప్రివ్యూ చూసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని వివరాలు అన్నీ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి.
7. దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద తెలిపిన హెల్ప్ డెస్క్ నెంబర్లకు ఆఫీస్ పని చేయు రోజులలో ఉదయం 10 గం. నుండి సాయంత్రం 5:30 గం. లోపల ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు (8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 9398810958).
8. ఒకవేళ దరఖాస్తు నింపేటప్పుడు ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అభ్యర్థులు కాండిడేట్ లాగిన్ లో డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకుని తిరిగి దరఖాస్తు సబ్మిట్ చేయాలి అని తెలియజేయడమైనది.
AP TET JUNE 2026 Notification Click here
AP TET JUNE 2026 Syllabus Click here
AP TET JUNE 2026 Schedule Click here
AP TET JUNE 2026 Previous Question Papers Click here

0 comments:
Post a Comment