HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

SSC డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ పొందడం ఎలా?

 SSC డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ పొందడం ఎలా?


మీ పదో తరగతి (SSC) ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్ పొరపాటున పోగొట్టుకున్నారా? లేదా పాడైపోయిందా?

అటువంటి సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (DGE) డూప్లికేట్ సర్టిఫికెట్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

దరఖాస్తు ఫారం, వెబ్సైట్ వివరాలు:

SSC డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగం యొక్క  (bse.ap.gov.in) ద్వారా అప్లికేషన్ పొందవచ్చు.



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


దరఖాస్తుకు కావలసిన ముఖ్యమైన పత్రాలు

డూప్లికేట్ సర్టిఫికెట్ దరఖాస్తుతో పాటు ఈ క్రింది పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.

1. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం:

వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన ఫారంలో వివరాలు నింపి, విద్యార్థి, హెడ్ మాస్టర్ (HM) సంతకాలు ఉండాలి.

2. CFMS సిటిజన్ చలానా: రూ. 250/- రుసుమును CFMS వెబ్సైట్ "ESE03 Government Ex-aminations Department" కింద చెల్లించిన చలానా. ఈ చలానా ప్రింట్ తీసుకోవాలి.

3. నోటరీ అఫిడవిట్ (Affidavit): రూ. 50/- స్టాంప్ పేపర్ పై నోటరీ లేదా జూనియర్ సివిల్ జడ్జి అటెస్టేషన్ చేయించిన అఫిడవిట్.

4. పోలీస్ సర్టిఫికెట్: ఒరిజినల్ సర్టిఫికెట్

పోయిందని, అది దొరకలేదని సబ్-ఇన్స్పెక్టర్ (SI) లేదా అంతకంటే పై స్థాయి అధికారి ఇచ్చిన ధృవీకరణ పత్రం.

గమనిక:


అగ్ని ప్రమాదాలు జరిగి విద్యార్థి సర్టిఫికెట్ పోగొట్టుకుని ఉంటే సంబంధిత అధికారుల Fire Certificate ఉంటుంది. ఈ సందర్భంలో సబ్-ఇన్స్పెక్టర్ లేదా అంతకంటే పై స్థాయి అధికారి వద్ద cer-tificate తీసుకోవలసిన అవసరం లేదు.

భారీ వర్షాలు, వరదలు & ఇతర ప్రకృతి విపత్తుల వలన విద్యార్థి సర్టిఫికేట్ పోగొట్టుకుని ఉంటే MRO వద్ద Certificate తీసుకోవలసి ఉంటుంది. ఈ సందర్భంలో సబ్-ఇన్స్పెక్టర్ (SI) లేదా అంతకంటే పై స్థాయి అధికారి వద్ద certificate తీసుకోవలసిన అవసరం లేదు.

5. HM కవరింగ్ లెటర్: మీరు చదివిన పాఠశాల హెడ్ మాస్టర్ నుండి అధికారిక లేఖ.

ఈ లేఖపై తప్పనిసరిగా Sign with School Stamp ఉండవలెను.

6. SSC జిరాక్స్ కాపీ: మీ పాత ఒరిజినల్ SSC సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ అందుబాటులో ఉంటే దానిని జతచేయండి.

ఇలా సిద్ధం చేసుకున్న అన్నిపత్రాలను మీ పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా అమరావతిలోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (DGE) కార్యాలయానికి పంపాలి.

కార్యాలయ చిరునామా

Directorate of Government Examinations,

గరుడ వేగ టవర్స్ (NH-16 Service Road), lakshmi Narasimha కాలనీ, మంగళగిరి, అమరావతి,

గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 522503.

విద్యార్థి గమనించవలసినవి:

మీ సర్టిఫికెట్ ప్రాసెసింగ్ సమయం గరిష్టంగా 7 రోజులు ఉంటుంది.

ఇది కేవలం సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ (HM) చిరునామాకు మాత్రమే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందుతుంది. విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లి హెడ్ మాస్టర్ ద్వారా సర్టిఫికెట్ను స్వీకరించాలి. విద్యార్థి తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది



Website 

SSC డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ పొందడం ఎలా?

0 comments:

Post a Comment

Recent Posts