జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
మే నెల ముగింపుకు వచ్చేసింది, మరో రెండు రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది, అయితే జూన్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అనేక కీలక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నా యి,దేశ ప్రజలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తాయి.ఆర్ధికపరంగా, ఇతర విషయాల్లో అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి.
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
ఇక బ్యాంక్ సెలవుల తో పాటు... నెల మారుతుందంటే.. ఎల్పీజీ గ్యాస్ ధరల్లో సవరణలు జరుగుతా యి. ప్రతీ నెలా ఒకటో తేదీన చమురు కంపెనీలు కొత్త గ్యాస్ ధరలను ప్రకటిస్తాయి. గత మూడు నెలలుగా ధరలను పెంచగా.. ఈ సారి గ్యాస్ ధరలు ఎలా ఉంటాయనేది, చర్చనీయాంశంగా మారింది. ఈ సారి కూడా పెంచుతారా? లేదా?స్థిరంగా ఉంచు తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
జూన్ 1వ తేదీ నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ కొన్ని అకౌంట్ల మెయింటైన్ రూల్స్ మార్చుతోంది. అందులో భాగంగా నోట్లు, కాయిన్స్ డిపాజిట్ల మీద చార్జీలు విధించనుంది. నోట్స్ డిపాజిట్‌పై 4 శాతం, కాయిన్ డిపాజిట్లపై 5 శాతం ఛార్జీలు విధించనుంది. అలాగే రూ.20 నోట్లు రూ.10 వేలు దాటకూ డదు. ఇక కాయిన్స్ డిపాజిట్ రూ.5 వేలు దాటకూడదు.
లిమిట్ దాటితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం అదనంగా ఛార్జీ విధించనుంది. ఇక జూన్ 1 నుంచి సోలార్ ప్యానెళ్ల నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. ఇక నుంచి ప్రభుత్వం ఆమోదించిన సోలార్ ప్యానెళ్లు మాత్రమే వాడాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ అందుతుంది. దీని వల్ల జూన్ నుంచి సోలార్ ప్యానెళ్ల ధర లు పెరిగే అవకాశ ముందని తెలుస్తోంది.


0 comments:
Post a Comment